Ramcharan: 2020 ఇదే రోజు... ఏం జరుగుతుందో చెప్పిన రామ్ చరణ్!

  • వచ్చే సంవత్సరం జూలై 30న 'ఆర్ఆర్ఆర్' విడుదల
  • హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
  • ట్విట్టర్ లో ఫ్యాన్స్ సంబరాలు
నేడు జూలై 30. వచ్చే సంవత్సరం ఇదే రోజున ఏం జరుగుతుంది? ఎవరమూ చెప్పలేము. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఏం జరుగుతుందో చెప్పేశాడు. 2020 జూలై 30న భారత సినీ రంగం గర్విస్తుందని అన్నాడు. ఎన్టీఆర్, తను హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'ఆర్ఆర్ఆర్' (వర్కింట్ టైటిల్) సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఆలియా భట్ కాగా, మరో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. సినిమా వచ్చే సంవత్సరం ఇదే రోజున విడుదల అవుతుందని చెబుతూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ఇప్పటి నుంచే సంబరాలు మొదలు పెట్టారు. 
Ramcharan
NTR
RRR

More Telugu News