Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ప్రవీణ్ ఆమ్రే..?

  • కొత్త కోచింగ్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ
  • హెడ్ కోచ్ పదవి కోసం దిగ్గజాల పోటీ
  • బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ఆమ్రే
దాదాపు రెండు దశాబ్దాల కిందట భారత జట్టుకు కొన్ని మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించిన ముంబై ఆటగాడు ప్రవీణ్ ఆమ్రే పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వరల్డ్ కప్ అనంతరం టీమిండియా కోచింగ్ స్టాఫ్ కాలపరిమితి ముగియడంతో కొత్త సిబ్బంది కోసం బీసీసీఐ ప్రకటన ఇవ్వడం తెలిసిందే. ప్రవీణ్ ఆమ్రే టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కోచింగ్ లో ఆమ్రే ట్రాక్ రికార్డు అమోఘం అని చెప్పాలి.

అజింక్యా రహానే, రాబిన్ ఊతప్ప, శ్రేయాస్ అయ్యర్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లకు ఆమ్రే పర్సనల్ కోచ్ గా పనిచేశాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, కొత్త బ్యాటింగ్ కోచ్ గా ఆమ్రే పేరు బాగా వినిపిస్తోంది. హేమాహేమీలందరూ టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా, బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంది ఆమ్రే ఒక్కడే. దాంతో, ఆమ్రే ఎంపిక ఖాయమని తెలుస్తోంది.
Team India
Pravin Amre
Batting Coach

More Telugu News