kuldeep Singh Sengar: ఉన్నావో అత్యాచార బాధితురాలి ప్రమాద ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌పై కేసు నమోదు

  • దాదాపు 10 మందిపై కేసు నమోదు
  • విషమంగా బాధితురాలి పరిస్థితి
  • వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్న వైద్యులు
ఉన్నావో అత్యాచార బాధితురాలి ప్రమాద ఘటనలో దాదాపు 10 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాయబరేలి జిల్లా సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో బాధితురాలితో పాటు ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె బంధువులిద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు మనోజ్ సింగ్ సెంగార్, మరో 8 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నేడు కేసు నమోదు చేశారు. కులదీప్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతంలో ఆరోపణ చేసింది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తరలించాలని వైద్యులు సూచించారు.
kuldeep Singh Sengar
Manoj Singh Sengar
Uttar Pradesh
Unnav
Police

More Telugu News