మాట మీద నిలబడే సీఎంను మొదటి సారి చూస్తున్నాం: జగన్ పై ఎమ్మెల్యే రోజా ప్రశంసలు

  • గతంలో అప్రాప్రియేషన్ బిల్లును పాస్ చేసుకోవడం చూశాం
  • జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు విభిన్నమైంది
  • ప్రతి రూపాయి ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టింది
ఏపీ శాసనసభలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, పేదల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనని వైసీపీ సభ్యురాలు రోజా ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా అప్రాప్రియేషన్ బిల్లు పెట్టి పాస్ చేసుకోవడాన్ని చూశామని, కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్ బిల్లు విభిన్నమైందని అన్నారు. ఈ బిల్లు ద్వారా ప్రతి రూపాయి ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారని, ఇప్పుడు, సీఎం జగన్ యాభై రోజుల పాలన చూసిన తర్వాత రాజన్న రాజ్యం వచ్చిందని, మాట మీద నిలబడే సీఎంను మొదటి సారి చూస్తున్నామని ప్రశంసించారు.
Go Back to Shorts
cm
jagan
Mla
Roja
YSRCP

More Telugu News