టాలీవుడ్ పెద్దలు కనీసం జగన్ ను అభినందించలేదు.. అదే చంద్రబాబు గెలిచి ఉంటేనా!: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ
- వైసీపీ వాళ్లను సినిమాల నుంచి తీసేయాలన్నారు
- జగన్ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదు
- అమరావతిలో మరో 30 ఏళ్లు వైసీపీ జెండానే
తాను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనమిక్స్ చేశానని చెప్పారు. రంజీ క్రికెట్ ప్రాపబుల్స్ లో తన పేరు ఉందన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, శ్రీఆంజనేయం, ఆ తర్వాత లౌక్యం సినిమాలతోనే తనకు మంచి బ్రేక్ వచ్చిందని పృథ్వీ తెలిపారు. జగన్ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
కనీసం జగన్ కు శుభాకాంక్షలు చెప్పడం కూడా వీళ్లకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఉంటే వీరంతా బొకేలతో సాయంత్రానికే ప్రత్యేక విమానాల్లో దిగిపోయేవారని ఎద్దేవా చేశారు. అమరావతిపై వైసీపీ జెండా రాబోయే 30 ఏళ్ల పాటు ఎగురుతూనే ఉంటుందని పృథ్వీ జోస్యం చెప్పారు.