Nayanatara: రూ. 10 కోట్ల ఆఫర్ ను మొహమాటం లేకుండా వద్దన్న నయనతార!

  • తమిళంలో కొత్త హీరో శరవణన్ పక్కన ఆఫర్
  • చెయ్యనని చెప్పేసిన నయనతార
  • కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నయన్ వ్యవహారం
ఒక సినిమాలో నటిస్తే, రెండు మూడు చిత్రాలకు ఇచ్చే రెమ్యునరేషన్ ను ఇస్తామంటే... ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ నయనతార మాత్రం ససేమిరా అందట. కోలీవుడ్ ఇప్పుడు ఇదే విషయాన్ని తెగ చర్చిస్తోంది. ఇంతకూ నయన్ వద్దన్న ఎమౌంట్ ఎంతో తెలుసా?. పది కోట్ల రూపాయలట. ఒక సినిమాకు ఇంత భారీ మొత్తాన్ని ఇస్తామని ఆఫర్ ఇస్తే, ఆమె బాగా ఆలోచించుకునే 'నో' చెప్పిందట.

తమిళంలో కొత్త హీరో శరవణన్ ను పరిచయం చేస్తూ, అతని పక్కన హీరోయిన్ గా నయనతార అయితే బాగుంటుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట. లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ తో, లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై కన్నేసిన ఆమె, కొత్త హీరో అనేసరికి వద్దని చెప్పేసిందట. అయినా వదలని నిర్మాతలు పది కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తామని నచ్చజెప్పినా అంగీకరించలేదట. కొత్త నటుడు కావడంతోనే నయన్ అంగీకరించలేదని కొంతమంది, పాత్ర నచ్చలేదని మరికొందరు చెబుతున్నారు. ఇక అసలు కారణమేంటో నయనతారే చెప్పాలి.
Nayanatara
Saravanan
New Movie
Kollywood

More Telugu News