మీరు వాట్స్ యాప్ వాడుతారా?... శుభవార్త!
- ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్స్ యాప్
- త్వరలోనే డెస్క్ టాప్ వర్షన్
- ఫోన్ తో పీసీని అనుసంధానం చేయకుండానే వాడుకునే అవకాశం
కాగా, 2015లో వాట్స్ యాప్ వెబ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, డెస్క్ టాప్ పై వాట్స్ యాప్ ను వాడుకోవాలంటే, మొబైల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఇక ఆ సమస్యను తీర్చేలా నేరుగా కంప్యూటర్ లో వాట్స్ యాప్ పనిచేసేలా 'యూనివర్సల్ విండోస్ ప్లాట్ ఫామ్' యాప్ ను సంస్థ సిద్ధం చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, ఫోన్ ఆఫ్ లో ఉన్నా, వాట్స్ యాప్ ను వాడుకునే సౌలభ్యం దగ్గరవుతుంది. ఇదే సమయంలో ఇక ఒకే ఎకౌంట్ పై పలు డివైజ్ లలో ఉపయోగించుకోవచ్చు.