తూర్పుగోదావరి జిల్లాలో నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ రహస్య పర్యటన.. పూజలు!
- చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు
- చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకం నిర్వహణ
- వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయిన తండ్రీకొడుకులు
కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన మొత్తం గోప్యంగా సాగింది. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు. కాగా, బాలకృష్ణ తర్వాతి చిత్రానికి సంబంధించి ఈ పూజలు చేసినట్లు నాగమల్లేశ్వర సిద్ధాంతి తెలిపారు.