Kumara Swamy: మరికొన్ని గంటల్లో బల పరీక్ష అనగా కీలక ఫైలుపై కుమారస్వామి సంతకం

  • ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం
  • మరో విడత రుణమాఫీపై సంతకం
  • రుణమాఫీ ఫైలుపై సీఎంగా ఆఖరి సంతకం
మరి కొన్ని గంటల్లో బలపరీక్ష.. ప్రభుత్వానికి గడ్డు సమయం. ప్రభుత్వం కూలే అవకాశాలే ఎక్కువ. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో కర్ణాటక సీఎం కుమారస్వామి మాట నిలుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని పేదలకు, రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న లేదా వార్షిక ఆదాయం రూ.లక్ష కంటే తక్కువ ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలు చేస్తామని హామీ ఇచ్చిన కుమారస్వామి ప్రభుత్వం తొలి విడత రుణమాఫీని చేపట్టింది. మరికాసేపట్లో బలపరీక్ష అనగా మరో విడత రుణమాఫీ ఫైలుపై సంతకం చేసి కుమారస్వామి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీఎంగా కుమారస్వామి ఆఖరి సంతకం అదే కావడం విశేషం.
Kumara Swamy
Karnataka
Yearly Income
Formers

More Telugu News