Andhra Pradesh: ఏపీ మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది: చంద్రబాబు

  • అసెంబ్లీ హుందాతనం పూర్తిగా దెబ్బతినేలా ఉంది
  • సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు
  • మాపై బురదజల్లుతున్నారు
ఏపీ మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా, ఎబ్బెట్టుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ హుందాతనం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, నోళ్లు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులపై చర్చకు రావాలని కోరినా పట్టించుకోవడం లేదని, సమావేశాలు ప్రారంభమై పదకొండు రోజులు అవుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. సభలో ఏ అంశం చర్చకు వచ్చినా తమకు అవకాశం ఇవ్వడం లేదని, వైసీపీ సభ్యులు తమపై నోరుపారేసుకున్న సందర్భాల్లో సరైన సమాధానం చెప్పాలని, కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నప్పటికీ, తమకు అవకాశం ఇవ్వకపోగా, బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh
assembly
Chandrababu
Telugudesam

More Telugu News