Andhra Pradesh: ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ సమావేశం

  • రాష్ట్రానికి సంబంధించిన వివరాలను చెప్పిన అధికారులు
  • ‘నవరత్నాలు’, ‘ఆరోగ్యశ్రీ పథకం’ అమలు గురించీ
  • ‘స్పందన’, ‘అమ్మఒడి’ వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్న గవర్నర్
ఏపీ రాజ్ భవన్ లో అధికారులతో గవర్నర్ బిశ్వభూషణ్ ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గవర్నర్ కు అధికారులు ఎంకే మీనా, సంజయ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నవరత్నాలు’, ‘ఆరోగ్యశ్రీ పథకం’ అమలు గురించీ వివరించారు. గ్రామ వాలంటీర్ల నియామకం, వార్డు సచివాలయాల అమలు, స్పందన కార్యక్రమం, అమ్మఒడి పథకం వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా గవర్నర్ అభివర్ణించినట్టు సమాచారం.
Andhra Pradesh
RajBhavan
Governor
Biswabhusan

More Telugu News