Andhra Pradesh: వైఎస్ జగన్ గారూ! ఏమిటీ అహంకారం?: నారా లోకేశ్ ఫైర్

  • మిమ్మల్ని ప్రశ్నించిన బీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు
  • మీ పాలనను ప్రశ్నించిన బీసీ నేతలను బెదిరిస్తున్నారు
  • ప్రశ్నించడం మా బాధ్యత. మేము ఇలాగే ప్రశ్నిస్తాం
ఏపీ శాసనసభ నుంచి నలుగురు టీడీపీ సభ్యులను ఈరోజు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ, ‘వైఎస్ జగన్ గారూ! ఏమిటీ అహంకారం? సభలో మిమ్మల్ని ప్రశ్నించిన బీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. బయట మీ పాలనని ప్రశ్నించిన బీసీ నేతలను బెదిరిస్తున్నారు. ప్రశ్నించడం మా బాధ్యత. మేమిలాగే ప్రశ్నిస్తాం. మీకు నచ్చకపోతే వెళ్ళి గంగలో దూకండి. అంతేకానీ బీసీల జోలికి వస్తే ఖబడ్దార్!’ అని హెచ్చరించారు.

‘మా పాలకొల్లు నేత, బీసీ నాయకుడు తారక సత్యకు అండగా మేము ఉన్నాం. బీసీలను వేధించడం ఆపకపొతే వారికి మద్దతుగా పోరాటాలు చేస్తాం. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే విమర్శలను స్ఫూర్తిగా తీసుకోండి. అంతేకానీ ఇలా అణచివేయాలని చూడడటం పిరికిచర్య’ అని జగన్ కు లోకేశ్ హితవు పలికారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
jagan

More Telugu News