కర్ణాటకం... కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరికీ ఆ అవకాశం దక్కలేదు!
- ఐదేళ్లు పూర్తికాలం పాలించింది ఆ ముగ్గురే
- ముగ్గురూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే
- పూర్తికాలం నిలవని జేడీఎస్, బీజేపీ ప్రభుత్వాలు
బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఆయన ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు పదవిలో ఉన్నారు. తర్వాత బీజేపీకి అధికారం అప్పగించేందుకు నిరాకరించడంతో కమలనాధులు ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి 2018 మేలో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. 14 నెలలకే ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొని నిన్న జరిగిన బలపరీక్షలో ఓటమిపాలైంది. బీఎస్ యడ్యూరప్ప 2007లో తొలిసారి బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. మే 2008లో ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో యడ్యూరప్ప రెండోసారి సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలతో 2011 జూలైలో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. మూడోసారి 2018 మే 17 నుంచి మే 23 వరకూ ఆరు రోజులు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు.