ఈడీ మాజీ అధికారి శ్రీనివాస్ గాంధీపై మనీ లాండరింగ్ కేసు నమోదు
- రాజకీయ నాయకుడికి సాయం చేసి భారీగా లబ్ధిపొందిన గాంధీ
- రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఈడీ
- త్వరలోనే ఆస్తుల అటాచ్
సీబీఐ కేసు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై దాడులు చేసింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. ఏపీ, హైదరాబాద్‌లలో శ్రీనివాస్ గాంధీ భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆయన అక్రమాస్తులను అటాచ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు.
ఓ రాజకీయ నాయకుడి జీఎస్టీ కేసును పర్యవేక్షించిన శ్రీనివాస్ గాంధీ ఆయనకు అనుకూలంగా వ్యవహరించి భారీగా లబ్ధిపొందినట్టు ఆరోపణలున్నాయి. 2010 నుంచి గాంధీ ఈడీలో పనిచేస్తూ వచ్చారు. 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019లో ఏకంగా రూ.3.74 కోట్లకు పెరిగాయి.