kishan reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బెదిరించిన కడప జిల్లా వ్యక్తి అరెస్ట్

  • ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా బెదిరింపులు
  • కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ బెదిరించిన నిందితుడు
  • గతంలో కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన ఇస్మాయిల్
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మంత్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇస్మాయిల్‌కు అరదండాలు వేశారు. కిషన్ రెడ్డిని అతను బెదిరించడం ఇదే తొలిసారి కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఫోన్ చేసి బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇస్మాయిల్ గతంలో కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కడపలో ఉంటున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
kishan reddy
ministar of state
kadapa
police

More Telugu News