Anna Canteen: అన్న క్యాంటీన్ పేరు, రూపురేఖలు మారిపోయాయ్!

  • ఐదు రూపాయలకే కడుపు నింపే అన్న క్యాంటీన్
  • పేరును మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు
  • వైట్ పెయింటింగ్, జగన్, వైఎస్ నిలువెత్తు పోస్టర్లు
ఏపీలో పేదలకు ఐదు రూపాయలకే కడుపు నింపే అన్న క్యాంటీన్‌ పేరు మారిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిన అన్న క్యాంటీన్ లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కారు రాజన్న క్యాంటీన్ లుగా మార్చేసింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్యాంటీన్ ల బిల్డింగులకు రంగులు మార్చాలని, కొత్త పేరును సూచించేలా బోర్డులు పెట్టాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్యాంటీన్‌ లకు వైట్‌ పెయింట్‌ వేసి, వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిలువెత్తు కటౌట్ ఫొటోలను ఏర్పాటు చేశారు. రాజన్న క్యాంటీన్‌ అంటూ బోర్డులు పెట్టించారు.
Anna Canteen
Rajanna Canteen
Food
Name Change

More Telugu News