Vizag: అనకాపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్!
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లిలోని జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనకాపల్లి నుంచి బయ్యవరం వరకు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి మరమ్మతు పనుల వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్తంభించిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.