Andhra Pradesh: లోకేశ్ కు లేని నాయకత్వాన్ని ప్రజలపై బలవంతంగా ఎందుకు రుద్దుతారు?: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • సోషల్ మీడియా ఇన్ చార్జి పెద్ద పదవా?
  • టీడీపీ నేతలు కీలక పదవి అని ప్రచారం చేస్తున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన నేత
టీడీపీ నేత నారా లోకేశ్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసలు టీడీపీ ప్రధాన కార్యదర్శి పెద్ద పదవా? లేక సోషల్ మీడియా ఇన్ చార్జి పెద్ద పదవా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు  ‘లోకేశ్ కు కీలక బాధ్యతలు’ అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా లోకేశ్ కు లేని నాయకత్వాన్ని టీడీపీ నేతలు ప్రజల మీద బలవంతంగా ఎందుకు  రుద్దుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.  
Andhra Pradesh
Nara Lokesh
Twitter
BJP
VISHNUVARDHANRDDY

More Telugu News