Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో గల్లా జయదేశ్, కేశినేని, రామ్మోహన్ నాయుడు భేటీ!

  • ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత ఇంట్లో సమావేశం
  • ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రామ్మోహన్ నాయుడు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ లోక్ సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఈరోజు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ముగ్గురు నేతలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ విషయమై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. తాను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు గల్లా జయదేవ్, కేశినేని నానితో భేటీ అయ్యానని తెలపారు. తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సాగిందని చెప్పారు. కాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్నతో కేశినేని ట్విట్టర్ వార్ పై ఈ భేటీలో చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. 
Andhra Pradesh
Telugudesam
Chandrababu

More Telugu News