ప్రియుడిని నిర్బంధించి, ప్రియారాలిపై అత్యాచారం... ప్రకాశం జిల్లాలో కలకలం!

కాసేపు ఏకాంతంగా ఉండాలని వచ్చిన ఓ జంటపై దాడి చేసిన ముగ్గురు యువకులు ప్రియుడిపై దాడి చేసి, అతనితో వచ్చిన యువతిపై అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కారంచేడులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చీరాల పట్టణం విఠల్‌ నగర్‌ కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం భర్త నుంచి విడాకులు పొంది, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తుండగా, ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్ ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. యువతిని లాక్కెళ్లి, అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Rape
Prakasam District
Lovers
Karamchedu

More Telugu News