రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో ధోనీ కీలక ప్రకటన
- విండీస్ టూర్ కు అందుబాటులో ఉండనన్న ధోనీ
- ప్యారా మిలిటరీ రెజిమెంట్ కు రెండు నెలలు సేవలందించాలని నిర్ణయం
- ధోనీ రిటైర్ కావడం లేదని ప్రకటించిన బీసీసీఐ
ఈ సందర్భంగా బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, 'మూడు విషయాలపై స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ కావడం లేదు. ప్యారామిలిటరీ రెజిమెంట్ కు రెండు నెలల పాటు ధోనీ సేవ చేయబోతున్నాడు. ఇది ముందే తీసుకున్న నిర్ణయం. ధోనీ నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తెలియజేశాం' అని తెలిపారు.