బ్లూవేల్ కు పోటీగా మరో భూతం.. మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
- కొత్త ఆన్ లైన్ గేమ్ కు బానిసైన దివాకర్
- టాస్కులు పూర్తిచేస్తూ చివరికి ఆత్మహత్య
- గేమ్ పేరును బయటపెట్టని పోలీసులు
దీంతో చదువుకోవాలనీ, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం ఆపాలని తల్లిదండ్రులు కుమారుడిని కోరారు. అయితే వీటిని పట్టించుకోకుండా అతను గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. ఈరోజు ఉదయం 8 గంటలైనా మాలే తన గదినుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా తలుపులు తీశారు. అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకుని నిర్జీవంగా వేలాడుతున్న మాలేను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, ఈ ప్రమాదకరమైన గేమ్ మరింత వ్యాప్తి చెందకూడదన్న ఉద్దేశంతో పోలీసులు దాని పేరును బయటపెట్టలేదు.