మీకు పోర్న్ వీడియోలు చూసే అలవాటుందా... అయితే మీపై నిఘా ఉన్నట్టే!
- గూగుల్, ఫేస్‌బుక్‌లు పక్కాగా మీపై కన్నేసి ఉంచాయి
- మీరు చూసే ప్రతి వీడియో సమాచారం వారి చేతికి
- థర్డ్ పార్టీ సంస్థలకు యూజర్ డేటా లీక్
2017లో 30 బిలియన్ల మంది పోర్న్ సైట్లు చూశారని, ఆశ్లీల సైట్ల కోసం వెతికే వారి సంఖ్య ప్రతి సెకనుకు 50 వేల వరకు ఉందని ఈ సంస్థలు తేల్చాయి. నెట్ ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ట్రాఫిక్ అశ్లీల సైట్లదేనని గుర్తించారు. ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ట్విట్టర్ మూడింటి ట్రాఫిక్ కంటే ఆరు రెట్లు అధికంగా పోర్న్‌సైట్ల ట్రాఫిక్ ఉందట.
అంతేకాదు థర్డ్ పార్టీ సంస్థలకు యూజర్ డేటా లీక్ అవుతున్నట్లు కూడా గుర్తించారు. గూగుల్ మరియు దాని అనుబంధ సంస్థలు దాదాపు 75 శాతం పోర్న్ సైట్లు, ఒరాకిల్ 25 శాతం, ఫేస్‌బుక్ 10 శాతం సైట్లపై నిఘాపెట్టినట్లు పరిశోధనలో తేలింది.