Cobra: నాగు పాముతో యువకుడి సెల్ఫీ.. కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

  • యువతలో పెరుగుతున్న సెల్ఫీ పిచ్చి
  • పాముతో సెల్ఫీలు తీసుకుని ఆటలు
  • సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
యువతలో సెల్ఫీ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. సెల్ఫీ మోజులో ఎంతోమంది తమ విలువైన  ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా యువతలో పరివర్తన రావడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. అయితే, ఈసారి ప్రాణాలు పోలేదు కానీ.. సెల్ఫీ తీసుకున్న యువకుడిని మాత్రం పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బర్‌గఢ్‌కి చెందిన కొందరు యువతీ యువకులు ఓ నాగుపాముతో సెల్ఫీలు దిగారు. అక్కడితో ఆగక రోహిత్ అనే యువకుడు దానితో ఆటలాడాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి చేరాయి. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రోహిత్‌ను అరెస్ట్ చేశారు.
Cobra
snake
Odisha
selfie

More Telugu News