Anantapur District: అనంతపురంలో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

  • మూడు నెలల క్రితం ఘటన
  • బాలిక తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి
  • నిందితుడిపై నిర్భయ చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు
అనంతపురంలో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. గుత్తి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని టి.కొత్తపల్లికి చెందిన నిందితుడు నరేశ్ మూడు నెలల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తరచూ వేధింపులకు పాల్పడుతూ హింసించాడు. అతడి వేధింపులను భరించలేని బాలిక విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Anantapur District
Gutti
girl
Rape
kidnap

More Telugu News