Varla Ramaiah: ప్రధాని మోదీ మీకు ఫ్రెండు అని చెప్పుకుంటారు కదా... ఇంకెంత కాలం మోసం చేస్తారు?: విజయసాయిపై వర్ల ఫైర్
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తనదైన శైలిలో విమర్శలు చేశారు. కంటితుడుపు ప్రశ్నలడుగుతూ కాలం వెళ్లబుచ్చే ఎంపీ విజయసాయిరెడ్డి గారూ, ప్రధాని మోదీ మీకు ఫ్రెండు అని చెప్పుకుంటారు కదా, ప్రత్యేక హోదా విషయం ఎందుకు నాన్చుతున్నారంటూ నిలదీశారు. హోదా గురించి అడగకుండా ప్రజలను ఇంకా ఎంత కాలం మోసం చేస్తారంటూ మండిపడ్డారు. గత కొన్నిరోజులుగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో పలు ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో వర్ల పైవిధంగా స్పందించారు. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి కరవు బృందాన్ని పంపడంపైనా విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడడం తెలిసిందే.