Karnataka: ఈరోజు బలపరీక్ష జరిగే అవకాశం లేదు: సీఎల్పీ నేత సిద్ధరామయ్య

  • విశ్వాసపరీక్షపై చర్చ పూర్తి కాలేదు
  • ఇంకా ఇరవై మంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది
  • సీఎం కుమారస్వామి ఇంకా సమాధానం చెప్పలేదు
ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపే సంకీర్ణ ప్రభుత్వం తమ మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ ఇచ్చిన గడువు ముగిసిపోయింది. కర్ణాటక అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఎలాంటి బలపరీక్ష జరగలేదు.చర్చ ముగిసే వరకూ ఓటింగ్ జరగదని స్పీకర్ రమేశ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. ఇదిలా ఉండగా, సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు బలపరీక్ష జరిగే అవకాశం లేదని అన్నారు. సోమవారం వరకూ బలపరీక్షపై చర్చ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఇరవై మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందని, విశ్వాసపరీక్షపై చర్చ పూర్తి కానందున ఇప్పటికిప్పుడే బలపరీక్ష నిర్వహించడం అసాధ్యమని అన్నారు. సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని మాత్రమే ప్రవేశపెట్టారని, జరిగిన చర్చపై ఆయన ఇంకా సమాధానం చెప్పలేదని అన్నారు.
Karnataka
cm
kumaraswamy
siddharamaiah

More Telugu News