Nara Lokesh: 'జగన్ మాయా ప్రభుత్వం' పేరుతో మరో విమర్శనాస్త్రం సంధించిన నారా లోకేశ్

  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • సీఎం జగన్ రైతుల పేరుతో వికృత రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం
  • సర్కారు తీరును ఎండగట్టే ప్రయత్నం
టీడీపీ నేత నారా లోకేశ్ అటు శాసనమండలిలో ఇటు సోషల్ మీడియాలో ఏపీ సర్కారుపై వరుసబెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, ట్విట్టర్ లో 'జగన్ మాయా ప్రభుత్వం' అంటూ టైటిల్ పెట్టి రైతుల ఆత్మహత్యలపై సర్కారు తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. రైతుల పేరుతో సీఎం జగన్ వికృత రాజకీయాలకు తెరలేపారంటూ మండిపడ్డారు.

1513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బడ్జెట్ కాగితాల్లో చెప్పి, ఇప్పుడు రైతుల ఆత్మహత్యల సంఖ్య 391 మాత్రమే అని చెప్పడం ద్వారా అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రైతుల బలవన్మరణాలు అంటూ చేస్తున్న కుట్రపూరిత ఆరోపణలు పక్కనబెట్టి, ఇప్పటికైనా మీ తండ్రిగారి ఏలుబడిలో ప్రాణాలు కోల్పోయిన 15,000 మంది రైతులకు ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించండి అంటూ లోకేశ్ నిప్పులు చెరిగారు.
Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News