కుల్ భూషణ్ కేసు తీర్పుపై పాక్ వక్రబుద్ధి... సెటైర్ వేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- మరణశిక్ష నిలిపివేయాలంటూ ఐసీజే తీర్పు
- తీర్పుకు వక్రభాష్యం చెప్పిన పాక్
- కుల్ భూషణ్ విడుదల కోసం ప్రయత్నించిన భారత్ కు విఘాతం అంటూ ప్రచారం
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అద్భుతమైన రీతిలో వ్యంగ్యాస్త్రం విసిరారు. "బహుశా ఐసీజే తన తీర్పును ఇంగ్లీషులో పేర్కొనడం వల్ల పాకిస్థాన్ సరిగా అర్థం చేసుకోలేకపోయిందేమో! మరణశిక్షను నిలిపివేయాలని తీర్పులో ఉంది. ఇది పాకిస్థాన్ కు మరోలా అర్థమైనట్టుంది. అందుకే భారత్ విజయం సాధిస్తే తాను విజయం సాధించినట్టుగా చెప్పుకుంటోంది" అంటూ సెటైర్ వేశారు.