లారెన్స్ సాయం కోసం వచ్చి... స్టేషన్లో బిచ్చమెత్తుకుంటున్న కుటుంబం!
- గుండెజబ్బుతో పుట్టిన బిడ్డ
- లారెన్స్ ను సాయమడిగేందుకు చెన్నైకి
- తిరుగు ప్రయాణానికి డబ్బులేక అవస్థ
అండగా ఉండాల్సిన భర్త వదిలేసి వెళ్లడంతో, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆమెను తోడబుట్టిన వెంకటేశన్ ఆదుకున్నాడు. తన వివాహాన్ని పక్కనబెట్టి, సోదరిని, మేనల్లుడిని చూసుకుంటూ గడిపాడు. చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిస్తే మేలు కలుగుతుందని, అతను ఆదుకుంటాడని చెబితే నమ్మి, గృహలక్ష్మిని, ఆమె బిడ్డను తీసుకుని చెన్నై వచ్చాడు.
అయితే లారెన్స్ దర్శనం వారికి లభించలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోగా, తిరిగి ఊరికి వెళ్లే మార్గం కనిపించక, రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు. వచ్చీపోయే ప్రయాణికులను ధర్మం అడుక్కుంటూ పొట్ట పోషించుకుంటున్నారు. వీరిని చూసిన పలువురు మీడియాకు విషయం చేరవేయడంతో వారి దీనగాథ వెలుగులోకి వచ్చింది.