కుళాయి వద్ద ఘర్షణ...బిందెలతో మోదడంతో మహిళ మృతి
- శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఘటన
- క్యూలో నిల్చున్నప్పుడు వాగ్వాదం
- అది ఘర్షణగా మారడంతో విషాదం
అదే సమయంలో మరికొందరు మహిళలు నిల్చున్నారు. అయితే, కొందరు వెనుకున్న వారు ముందుకు వచ్చేస్తున్నారన్న అంశంపై తొలుత మహిళల మధ్య మాట యుద్ధం మొదలయ్యింది. కాపేపటికి ఘర్షణగా మారింది. దీంతో మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి సరస్పరం బిందెలతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ గుండె, తలపై బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.