England: మ్యాచ్ టై... సూపర్ ఓవర్ లోకి ప్రవేశించిన వరల్డ్ కప్ ఫైనల్

  • స్కోర్లు సమం
  • 241 పరుగులు చేసిన ఇంగ్లాండ్
  • చివరి బంతికి సింగిల్ తీసిన స్టోక్స్
ప్రపంచకప్ ఫైనల్ కు సిసలైన అర్థం చెప్పేలా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కొదమసింహాల్లా తలపడ్డ వేళ ఫైనల్ మ్యాచ్ టై అయింది. ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మొదట కివీస్ 241 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు చేయగా, ఓ సిక్స్ బాదిన స్టోక్స్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన స్థితిలో సింగిల్ తీయడంతో స్కోర్లు సమం అయ్యాయి. కాగా, ఇది ఫైనల్ మ్యాచ్ కావడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇరు జట్లు ఒక్కో ఓవర్ ఆడాల్సి ఉంటుంది.
England

More Telugu News