టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్ లను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించిన రాష్ట్రపతి
- రాష్ట్రపతి తిరుమల పర్యటన
- ఈ ఉదయం స్వామివారిని సేవించుకున్న రామ్ నాథ్ కోవింద్
- రాష్ట్రపతికి వేదిక్ యూనివర్శిటీ గురించి చెప్పిన వైవీ, సింఘాల్
భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల వివరాలను వైవీ, సింఘాల్ రాష్ట్రపతితో పంచుకున్నారు. అంతేగాకుండా, వేదిక్ యూనివర్శిటీ ప్రత్యేకతలను కూడా వివరించారు. తిరుమల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి రేణిగుంట పయనమయ్యారు. అక్కడినుంచి చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆయన శ్రీహరికోట వెళతారు.