విజయసాయిరెడ్డి! అమరావతిపై చర్చకు నేను సిద్ధం.. సమయం, తేదీ ఫిక్స్ చేయండి!: బుద్ధా వెంకన్న
- చంద్రబాబు హయాంలో అమరావతి పరుగులుపెట్టింది
- ఇప్పుడేమో అమరావతి అంధకారంగా మారింది
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
ఓవైపు సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డుకు రూ.5 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం బడ్జెట్ లో రాజధాని అమరావతికి మాత్రం రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీన్ని బట్టే వైసీపీ నేతలు ఇచ్చింది గ్రాఫిక్స్ హామీలని అర్థమవుతోందన్నారు. అమరావతి గురించి ట్విట్టర్ లో మాట్లాడటం కాదనీ, ధైర్యం ఉంటే అవే మాటలను ఖాళీ అయిన రాజధాని రైతుల మధ్య నిలబడి మాట్లాడాలని డిమాండ్ చేశారు.