Uma Yadav: టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో 12 మంది అరెస్ట్

  • ప్రధాన నిందితుడిగా తోట శ్రీనివాసరావు యాదవ్
  • నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • 12 మందికీ రిమాండ్ విధించిన కోర్టు
గత నెల 25న మంగళగిరిలో టీడీపీ నేత ఉమా యాదవ్‌ను అత్యంత దారుణంగా ప్రత్యర్థులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమా యాదవ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా తోట శ్రీనివాసరావు యాదవ్ ఉన్నారు. పోలీసులు ఆయనతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపరిచారు. ఆ 12 మందికీ న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసు విచారణలో భాగంగా ఆధిపత్య పోరు కారణంగానే నిందితులు ఉమా యాదవ్‌ను హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు.
Uma Yadav
Srinivasarao Yadav
Police
Mangalagiri
Murder Case

More Telugu News