New Delhi: అత్యంత ఖరీదైన ప్రాంతాల జాబితాలో చోటు దక్కించుకున్న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్

  • నివేదికను వెల్లడించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ  
  • చదరపు అడుగుకు 144 అమెరికన్ డాలర్ల అద్దె
  • మొదటి స్థానాన్ని సంపాదించుకున్న హాంకాంగ్
ప్రపంచలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 9వ స్థానాన్ని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వరుసగా రెండో సారి సంపాదించుకుంది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ఓ నివేదికను వెల్లడించింది. దీనిలోని వివరాల ప్రకారం, ఢిల్లీ నడి మధ్యలో ఉన్న ఈ కన్నాట్ ప్లేస్‌లో వార్షిక అద్దె చదరపు అడుగుకు 144 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి స్థానాన్ని రెండోసారి హాంకాంగ్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ సంపాదించుకుంది. అక్కడ చదరపు అడుగుకు 322 అమెరికన్ డాలర్ల వార్షిక అద్దె ఉందని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ ప్రధాన మార్కెట్ కావడంతో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి పది స్థానాల్లో నిలుస్తూనే ఉందని సీబీఆర్ఈ అధికారి వెల్లడించారు.  
New Delhi
Kannat Place
World
Hongkong
Central District
CBRE

More Telugu News