బాలీవుడ్ నటి రీతుపర్ణసేన్ గుప్తాకు ఈడీ నోటీసులు
- హిందీ, బెంగాలీలో పలు సినిమాల్లో నటించిన రీతుపర్ణసేన్
- రోజ్ వేలీ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం
- 'ఘటోత్కచుడు' చిత్రంలో ప్రేక్షకులను అలరించిన రీతుపర్ణ
రోజ్ వేలీ కుంభకోణం పశ్చిమబెంగాల్ ను ఊపేస్తోంది. ఎంతో మంది ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎందరికో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్ జీత్ చటర్జీ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు.