గవర్నర్ నరసింహన్ ను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేయాలి
- భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం కల్గించాలి
- వైవీ సుబ్బారెడ్డికి సూచించిన గవర్నర్
టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నామని గవర్నర్ కు వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ వాహనాలు తీసుకొస్తామని, తిరుమలలో రద్దీని తగ్గించేందుకు కొండకిందే వసతి ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారని సమాచారం.