నేడు అనంతపురంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు!
- ఇప్పటికే కడపకు చేరుకున్న టీడీపీ అధినేత
- రోడ్డు మార్గంలో తాడిపత్రికి ప్రయాణం
- హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
తర్వాత ధర్మవరం నియోజకవర్గంలోని పత్యాపురం గ్రామంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త గొల్లరాజు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శిస్తారు. ఆ తర్వాత ధర్మవరం పట్టణంలోని ఫంక్షన్ హాలులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. రాత్రికి అనంతపురం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పనులు ముగించుకుని విమానంలో టీడీపీ అధినేత గన్నవరానికి చేరుకుంటారు.