కర్ణాటక సంక్షోభంపై సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
- సమస్య పరిష్కారమైంది
- ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
- కూటమి ప్రభుత్వం యథావిధిగా కొనసాగుతుంది
కాగా, కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో కర్ణాటక సర్కారు సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన అసంతృప్తులు ముంబయి వెళ్లి ఓ హోటల్ లో మకాం వేసి కర్ణాటక రాజకీయాలను శాసించే స్థితికి చేరారు. చివరికి కాంగ్రెస్ మంత్రులు తమ పదవులను అసంతృప్తులకు త్యాగం చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారమైందంటూ కుమారస్వామి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.