Puri Jagannadh: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న పూరి జగన్నాథ్, ఛార్మీ

  • ఇప్పటికే పూరి కనెక్ట్స్ సంస్థను నిర్వహిస్తున్న పూరి, ఛార్మీ
  • త్వరలో బట్టల వ్యాపారంలోకి అడుగు
  • మగవారి బట్టలను ఆన్ లైన్లో అమ్మడమే ఈ బిజిసెస్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినీ నటి ఛార్మీలు ఇప్పటికే వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో ఇప్పటికే ఓ సంస్థను వీరిద్దరూ కలసి నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా కొత్త హీరో, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. మరోవైపు, పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ 'పూరి టూరింగ్ టాకీస్' పనులను కూడా ఛార్మి పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా వీరిద్దరూ కలసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. మగవారి బట్టలను ఆన్ లైన్లో అమ్మడమే వీరి కొత్త బిజినెస్. ఈ వ్యాపారం కోసం beismart.in అనే వెబ్ సైట్ ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఛార్మి తెలిపింది. ముందుగా ఆర్డర్ చేసిన వారికి 30 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుందని పేర్కొంది.
Puri Jagannadh
Charmi
Business
Tollywood

More Telugu News