Tamil Nadu: ముహూర్తానికి ముందు వధువు పరారీ.. ఆగిపోయిన పెళ్లి

  • బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నానని చెప్పిన యువతి
  • తిరిగిరాకపోవడంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు పరారవ్వడంతో వివాహం ఆగిపోయింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా చిన్నసేలంలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలియత్తూరు గ్రామానికి చెందిన శక్తివేల్‌ కుమార్తె దుర్గాదేవి (20) ఓ కళాశాలలో తమిళ భాషా శాస్త్రం అభ్యసిస్తోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో వధూవరుల కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

 కాగా, ఈనెల 2వ తేదీన బ్యూటీ పార్లర్‌కని వెళ్లిన నవ వధువు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసినవారు, బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో నిన్న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కుమార్తె అదృశ్యంపై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశారు.
Tamil Nadu
villupuram district
bride
marriage break

More Telugu News