రూ. 10 వేల కోట్లతో భారీ యుద్ధనౌకల నిర్మాణం.. హెచ్ఎస్ఎల్ కి ఆర్డర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- హెచ్ఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
- ఒక్కొక్కటి 45 వేల టన్నుల బరువుండే భారీ యుద్ధనౌకల నిర్మాణం
- తొలి యుద్ధనౌకను నాలుగేళ్లలోపే అందించేలా షరతు
ఈ ఆర్డర్ కింద ఒక్కొక్కటి 45 వేల టన్నుల బరువుండే ఐదు యుద్ధనౌకలను హెచ్ఎస్ఎల్ నిర్మించబోతోంది. యుద్ధాల్లో పాల్గొనే నౌకలకు అవసరమైన సామగ్రిని, సిబ్బందికి కావాల్సిన ఆహారాన్ని కూడా అందించే మదర్ షిప్స్ లా కూడా ఇవి వ్యవహరిస్తాయి. ఒప్పందం ప్రకారం మొదటి యుద్ధనౌకను నాలుగేళ్లలోపే నిర్మించాల్సి ఉంటుంది. ఈ యుద్ధనౌకల నిర్మాణం కోసం టర్కీకి సంబంధించిన ఎనడోలు షిప్ యార్డ్ తో హెచ్ఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఒప్పందంలో భాగంగా సాంకేతిక సహకారం, డిజైన్లను ఎనడోలు సంస్థ బదిలీ చేయనుంది.