ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి

ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తన స్వగ్రామంలో కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన తల్లి, కుమారుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ విందుకు మీరెందుకు వచ్చారు? అంటూ తల్లి సువార్తమ్మ, కొడుకు సురేశ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాళ్లిద్దరికీ గాయాలయ్యాయి. బాధితులకు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
Prakasam District
markapuram
YSRCP
Telugudesam

More Telugu News