South Africa: డుప్లెసిస్ సెంచరీ, డుస్సెన్ పవర్ హిట్టింగ్... ఆసీస్ కు 326 పరుగుల టార్గెట్ ఇచ్చిన సఫారీలు

  • మాంచెస్టర్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 రన్స్  
  • డికాక్ అర్ధసెంచరీ
మాంచెస్టర్ లో జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియాపై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు నమోదు చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ నమోదు చేయడం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో హైలైట్ అని చెప్పాలి. డుప్లెసిస్ 94 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. మరోవైపు వాన్ డర్ డుస్సెన్ సైతం తన భారీ షాట్లతో ఆసీస్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. డుస్సెన్ 97 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 95 పరుగులు సాధించాడు. అంతకుముందు, ఓపెనర్లు మర్ క్రమ్ 34, డికాక్ 52 పరుగులతో సరైన పునాది వేశారు. ఇక, ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
South Africa
Australia
World Cup

More Telugu News