Punjab: రాష్ట్రపతికి రక్తంతో లేఖ... ఇద్దరు అక్కాచెల్లెళ్ల వేదన

  • పంజాబ్ కు చెందిన అక్కాచెల్లెళ్లపై చీటింగ్ కేసు
  • బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి
  • రాష్ట్రపతితో మొరపెట్టుకున్న అక్కాచెల్లెళ్లు
తమపై అన్యాయంగా కొందరు చీటింగ్ కేసు పెట్టారని, తమను ఆదుకోవాలని కోరుతూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన వైనం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పంజాబ్ లోని మోగా ప్రాంతానికి చెందిన నిషా కౌర్, అమన్ జ్యోత్ కౌర్ అక్కాచెల్లెళ్లు. అయితే, స్థానికంగా ఓ వ్యక్తి వీరిద్దరు డబ్బు విషయంలో మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఫిర్యాదు చేయడమే కాకుండా, తిరిగి తమపైనే బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఆ అక్కాచెల్లెళ్లు భీతిల్లిపోయారు. దాంతో తమ రక్తంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. తమ పరిస్థితిని వివరిస్తూ, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాకాని పక్షంలో కనీసం తమకు కారుణ్య మరణానికి అయినా అనుమతి ఇవ్వాలంటూ అభ్యర్థించారు. 
Punjab
President Of India
Sisters
Letter
Blood

More Telugu News