Vijay Sai Reddy: లోపలేస్తారన్న అనుమానం చంద్రబాబుకు వచ్చేసింది: విజయసాయి రెడ్డి

  • భయం వేసినప్పుడల్లా భద్రత గుర్తుకొస్తుంది
  • రక్షించాలని ప్రజలను వేడుకున్నారు
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి సెటైర్లు
తనపై ఉన్న అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లాలన్న భయం వేసినప్పుడల్లా, చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. "అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు. తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు.దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?" అని ప్రశ్నించారు. 
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News