Sania Mirza: భర్త రిటైర్ మెంట్ పై స్పందించిన సానియా మీర్జా!

  • బంగ్లాతో మ్యాచ్ అనంతరం షోయబ్ మాలిక్ రిటైర్ మెంట్ ప్రకటన
  • ప్రతి ముగింపు తరువాత ఓ కొత్త అవకాశం
  • భర్తను చూసి గర్వపడుతున్నానన్న సానియా
అంతర్జాతీయ క్రికెట్ కు షోయబ్ మాలిక్ రిటైర్ మెంట్ ప్రకటించగా, ఆయన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందించింది. ట్విట్టర్ వేదికగా, తన భర్త పాకిస్థాన్ క్రికెట్ కు అందించిన సేవలను గుర్తు చేసుకుంది. ప్రతి కథకూ ఓ ముగింపు తప్పదని, జీవితంలో ప్రతి ముగింపు తరువాతా ఓ కొత్త అవకాశం ఎదురు చూస్తుంటుందని వ్యాఖ్యానించింది.

రెండు దశాబ్దాల పాటు దేశం తరఫున నిబద్ధతతో ఆడిన మాలిక్ ను చూసి తను, ఇజాన్ గర్వపడుతున్నామని పేర్కొంది. కాగా, వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ తరువాత మాలిక్‌ తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లాడిన మాలిక్, 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియాతో మ్యాచ్ లో డక్కౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ కి ముందు రోజు భార్యతో కలిసి మాలిక్ డిన్నర్ కు వెళ్లగా అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
Sania Mirza
Shoiab Malik
Cricket
Retirement
Pakistan

More Telugu News