టీడీపీ కార్యకర్తల కోసం ఫేస్ బుక్ పేజీని ప్రారంభించిన నారా లోకేశ్!
- వైసీపీ వేధింపులపై ఫిర్యాదు చేయాలని విన్నపం
- అభ్యంతకర పోస్టులను పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచన
- వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమపై ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులైనా కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.