చిన్నారిని కిడ్నాప్ చేసి పారిపోతున్న వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి

ఓ చిన్నారిని ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్‌ను స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కదిరిలో జరిగింది. తన తల్లితో కలిసి కదిరి వెళ్లిన చిన్నారిని బస్టాండ్ సమీపంలో పిల్లలను అపహరించే ముఠా సభ్యుడు కిడ్నాప్‌ చేయడానికి యత్నించాడు. విషయాన్ని గమనించిన ప్రయాణికులు కిడ్నాపర్‌ను పట్టుకుని చితకబాది చిన్నారిని తల్లికి అప్పగించారు. అనంతరం కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించారు. తాను కదిరి వచ్చినప్పటి నుంచి కిడ్నాపర్ తనను వెంబడిస్తున్నట్టు చిన్నారి తల్లి తెలిపింది. తన బిడ్డను స్థానికులే రక్షించారని పేర్కొంది.

Kadiri
Kidnap
Police
Bustand

More Telugu News